ePaper
Monday, September 7, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణచేనేత కార్మికులకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం

చేనేత కార్మికులకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

నారాయణపేట, నవంబర్ 23(నేటి దర్శిని): నారాయణపేట జిల్లా కేంద్రంలోని శాసన్ పల్లి రోడ్డులో భీష్మరాజ్ ఫౌండేషన్ కార్యాలయంలో చేనేత కార్మికుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 20 మంది చేనేత కార్మికులకు ప్రతి ఒక్కరికి రూ.12,000 చొప్పున ఆర్థిక సాయం చెక్కులను  భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి అందజేశారు. చేనేత రంగం అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తున్నామని డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కుటుంబాలకు చిన్నపాటి సహాయం అయినా బలం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. చెక్కులు అందుకున్న చేనేత కార్మికులు డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular