ePaper
Sunday, September 6, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణప్రతిఒక్కరూ భక్తిమార్గంలో పయనించాలి: రాజ్ కుమార్ రెడ్డి

ప్రతిఒక్కరూ భక్తిమార్గంలో పయనించాలి: రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

👉 నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్న భీష్మరాజ్ ఫౌండేషన్ బృందం

నారాయణపేట, సెప్టెంబర్22 (నేటి దర్శిని): ప్రతిఒక్కరూ భక్తిమార్గంలో పయనించాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం నిడుగుర్తి గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో నెలకొల్పిన మండపంలో అమ్మవారికి సోమవారం భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి… ఫౌండేషన్ సభ్యులతో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండప నిర్వాహకులు, యువకులు శాలువలతో రాజ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఆంజనేయస్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయాల్లో రాజ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు అనంతరెడ్డి, రామచందర్, శ్రీనివాస్ గౌడ్, మదుసూదన్ రెడ్డి, అరవింద్ గౌడ్, శివారెడ్డి, రాములు, రాజు, కోట్ల నర్సింహులు, కృష్ణయ్య, యువకులు వేణురెడ్డి, శివరాంరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వంశీకృష్ణ, శివరామ్, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన రెడ్డి, గోపాల్ గౌడ్, నర్సింహనాయుడు, శ్రీనివాస్ రెడ్డి, ఎం.సంతోష్, రాజప్ప గౌడ్, అశోక్ బసుదే, జేకే అనిల్, రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular