ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణబస్సు సౌకర్యం కల్పించాలి

బస్సు సౌకర్యం కల్పించాలి

📰 Generate e-Paper Clip

‘పేట’ డీఎంను కలిసి వినతిపత్రం సమర్పించిన భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి, సభ్యులు

నారాయణపేట జూన్21 (నేటి దర్శిని):
బస్సు సౌకర్యం లేక ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో చదివే వందలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్యను శనివారం వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల పరిధిలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, జూనియర్‌ కళాశాలను ఇటీవల భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాఠశాల, కళాశాల నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అందులో భాగంగా పాఠశాల, జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న వందలాది మంది విద్యార్థినీ విద్యార్థులతో పాటు అధ్యాపకులు పాఠశాల, కళాశాలకు రావడానికి బస్సు సౌకర్యం లేక ఉదయం, సాయంత్ర సమయాల్లో ఇబ్బందులు పడుతున్నారని తమకు వివరించారని తెలిపారు. నారాయణపేట డిపో నుంచి ధన్వాడ మీదుగా కిష్టాపూర్ వరకు ఆర్టీసీ బస్సును నడపాలని కోరుతూ నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్యను వినతిపత్రం అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాల నుంచి పాఠశాల, కళాశాలలో చదువుకునేందుకు వస్తున్నారని, బస్సు సౌకర్యం లేక వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇక్కడ బస్సు సౌకర్యం లేక కొందరు విద్యార్థులు అడ్మిషన్లు వెనక్కి తీసుకొని వేరే ప్రాంతానికి తరలివెళ్తున్నారని వివరించారు. విద్యార్థుల సమస్యలను పరిగణనలోకి తీసుకొని బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఫౌండేషన్ సభ్యులు ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, హన్మంతు ముదిరాజ్, గోపాల్ గౌడ్, నర్సింహనాయుడు, ఎం.సంతోష్, వై.సంతోష్, కృష్ణ యాదవ్, శ్రీనివాస్, వెంకటరావు, రాజు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular