Homeతెలంగాణపేరపళ్లలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు కృషి

పేరపళ్లలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు కృషి

📰 Generate e-Paper Clip

శివాజీ విగ్రహానికి అయ్యే రూ.2.50 లక్షల చెక్కును అందజేసిన రాజ్ కుమార్ రెడ్డి

విగ్రహ ఏర్పాటుకు సహకరించినందుకు హర్షం వ్యక్తం చేసిన నిర్వాహకులు

ఎల్.బీ.నగర్ మే20 (నేటి దర్శిని):
నారాయణపేట జిల్లా పేరపళ్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా పేరపళ్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు గాను రూ.2.50 లక్షల చెక్కును మంగళవారం ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ఎల్బీనగర్ లోని ఫౌండేషన్ కార్యాలయంలో రాజ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు కోసం గతంలో చత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, గ్రామస్తులు తమను కలిసి విన్నవించారని, వారి విజ్ఞప్తి మేరకు ఛత్రపతి శివాజీ విగ్రహానికి అయ్యే రూ.2.50లక్షలను పూర్తిగా తామే భరిస్తూ విగ్రహాన్ని ఇప్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కుంటి సాయికుమార్, కుంటిపాప ఆంజనేయులు, బేత్మీ నరేష్, చాకలి ఆంజనేయులు, నీరటి బాలరాజు, ఎల్లంగిరి రాజు తదితరులు పాల్గొన్నారు.

రాజ్ కుమార్ రెడ్డి సేవలు మరువలేనివి: సాయికుమార్

నారాయణపేట జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారని, ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని పేరపళ్ల ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ నిర్వాహకులు సాయికుమార్ కొనియాడారు. పేరపళ్ల గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని రాజ్ కుమార్ రెడ్డిని కోరిన వెంటనే ఆయన సహృదయంతో స్పందిస్తూ చత్రపతి శివాజీ విగ్రహానికి అయ్యే రూ.2.50 లక్షలను చెక్కు రూపంలో అందజేయడం అభినందనీయమని అన్నారు. భీష్మ రాజ్ ఫౌండేషన్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలు మరింతగా విస్తరించి ప్రజల ఆదరణ పొందాలని ఆయన కోరారు. భీష్మరాజ్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular