ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణఅనారోగ్యంతో జామా మసీదు ఇమామ్ హఫీజ్ మహమ్మద్ పక్రుద్దీన్ తాజ్ మృతి

అనారోగ్యంతో జామా మసీదు ఇమామ్ హఫీజ్ మహమ్మద్ పక్రుద్దీన్ తాజ్ మృతి

📰 Generate e-Paper Clip

∆ నివాళులర్పించిన రాజ్ కుమార్ రెడ్డి…

∆ అంత్యక్రియల నిమిత్తం రూ.10వేలను అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి…

నారాయణపేట మే09 (నేటి దర్శిని):
అనారోగ్యంతో బాధపడుతూ నారాయణపేట జామా మసీదు ఇమామ్ హఫీజ్ మహమ్మద్ ఫక్రుద్దీన్ తాజ్ శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో మరణించారు. నారాయణపేట జామా మసీదు ఇమామ్ హఫీజ్ మహమ్మద్ పక్రుద్దీన్ తాజ్ మరణవార్త తెలుసుకున్న భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పార్థివదేహం వద్ద నివాళులు అర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన అంత్యక్రియల నిమిత్తం భీష్మరాజ్ ఫౌండేషన్ తరఫున 10వేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయాన్ని నారాయణపేట జామా మసీదు అధ్యక్షులు మహ్మద్ రఫిక్ చాంద్ కు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో ముస్లిం పెద్దలు, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, సుదర్శన్ రెడ్డి, హన్మంతు ముదిరాజ్, శివరాజ్, నర్సింహనాయుడు, జేవీ రావు, వై.సంతోష్, కృష్ణ యాదవ్, ఎం.సంతోష్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular