Homeతెలంగాణమహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి : రాజ్ కుమార్ రెడ్డి

మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి : రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ కు నివాళులర్పించిన రాజ్ కుమార్ రెడ్డి

ఎల్.బీ.నగర్ ఏప్రిల్05 (నేటి దర్శిని):
భారత మాజీ ఉప ప్రధానమంత్రి దివంగత బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం ఎల్బీనగర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహాలకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయులు చూపిన మార్గంలో యువత పయనించి వారి ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. నివాళులు అర్పించిన వారిలో ఆదిరాల రమేష్, మహేష్ యాదవ్, శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular