ePaper
Monday, September 7, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణపద్మశాలి నిత్యాన్నదాన సత్రంలో ఘనంగా శివపార్వతుల కల్యాణం

పద్మశాలి నిత్యాన్నదాన సత్రంలో ఘనంగా శివపార్వతుల కల్యాణం

📰 Generate e-Paper Clip

యజ్ఞంలో పాల్గొన్న పద్మశాలీయులు

దేశం నలుమూలల నుండి హాజరైన పద్మశాలీయులు

శ్రీశైలం ఫిబ్రవరి26 (నేటిదర్శిని):
మహా శివరాత్రిని పురస్కరించుకొని శ్రీశైలంలోని అఖిలభారత భక్త మార్కండేయ పద్మశాలీల నిత్యాన్నదాన సత్రం ఆవరణలో బుధవారం శ్రీ శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని భక్తుల జయజయధ్వానాల మధ్య కన్నుల పండువగా నిర్వహించారు. అంతకుముందు దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దంపతులచే యజ్ఞాలను చేయించారు. పూజలు, యజ్ఞాల అనంతరం వేలాది మంది భక్తులకు మహా అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. శివపార్వతుల కల్యాణ మహోత్సవానికి సహకరించిన దాతలను సత్రం నిర్వాహకులు శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సత్రం అధ్యక్షులు వర్కాల సూర్యనారాయణ,  కార్యనిర్వాహక అధ్యక్షులు కర్నాటి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జేరపు చంద్రశేఖర్, కార్యదర్శి పున్న శ్రీనివాస్,  మేనేజర్ కృష్ణ, సిబ్బంది రాజేశ్వరి, అధిక సంఖ్యలో భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular