ePaper
Monday, September 7, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణబాలాజీ దేవాలయ అభివృద్ధికి కృషి రాజ్ కుమార్ రెడ్డి

బాలాజీ దేవాలయ అభివృద్ధికి కృషి రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

బాలజీ దేవాలయ ఆవరణలో భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నీటి బోరు ఏర్పాటు

రూ.31వేల విలువైన హుండి అందజేత

నారాయణపేట ఫిబ్రవరి09 (నేటిదర్శిని):
నారాయణపేట జిల్లా ఎక్లస్ పూర్ లోని బాలాజీ దేవాలయ ఆవరణలో భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నీటి బోరును వేయించడం జరిగింది. రూ.31వేల వ్యయంతో తయారు చేయించిన హుండిని దేవాలయానికి అందజేసినట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేవాలయంలో నీటి బోరు లేని కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారని దేవాలయ నిర్వాహకులు తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. భక్తులు, సిబ్బంది అవసరాల దృష్ట్యా దేవాలయ ఆవరణలో నీటి బోరును ఏర్పాటు చేయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మన్నె గోపాల్, సుదర్శన్ రెడ్డి, హనుమంతు, శ్రీనివాస్, నర్సింహులు, శివరాజ్, చామకూర నగేష్, ఎం.సంతోష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular