ePaper
Monday, September 7, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణఅభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి కృషి: రాజ్ కుమార్ రెడ్డి

అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి కృషి: రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

రూ.11లక్షలతో ఆలయ శిఖర నిర్మాణానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చర్యలు

నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

దామరగిద్ద జనవరి21 (నేటిదర్శిని):
అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి కృషి చేస్తున్నామని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలోని పురాతన అభయాంజనేయ స్వామి దేవాలయ పునః నిర్మాణంలో భాగంగా దేవాలయ శిఖర నిర్మాణానికి మంగళవారం రాజ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి దేవాలయ శిఖర నిర్మాణానికి తమ ఫౌండేషన్ తరుఫున రూ.11 లక్షలను కేటాయించి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగా మంగళవారం శిఖర నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని పేర్కొన్నారు. అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా ఆలయ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవాలయ శిఖర నిర్మాణానికి హాజరైన డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డిని నిర్వాహకులు, గ్రామస్తులు శాలువలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు జ్ఞానేశ్వర్, ఆవుటి భస్వరాజ్, బజరంగ్ దళ్ కార్యకర్తలు, యువకులు, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, వై.సంతోష్, మధుసూదన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వెంకటేష్, శ్రీనివాస్, నర్సింహులు, ఎం.సంతోష్, శివరాజ్, వెంటప్ప, నందు, అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular