ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణగౌరవ డాక్టరేట్ అందుకున్న రాజ్ కుమార్ రెడ్డి

గౌరవ డాక్టరేట్ అందుకున్న రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఎల్.బి.నగర్ డిసెంబర్28 (నేటిదర్శిని):
ఆపదలో ఉన్న పేదవారికి అభయ హస్తాన్ని అందిస్తూ పేదల గుండెల్లో గుడి కట్టుకున్న భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కె.రాజ్ కుమార్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ వారు గౌరవ డాక్టరేట్ ను శనివారం తమిళనాడులోని వసూర్ లో అందజేశారు. గౌరవ డాక్టరేట్ ను అందుకున్న కె.రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదరికంతో బాధపడుతున్న వారికి చేయూతనందిస్తూ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో యువతను ప్రోత్సహిస్తూ విశేష సేవలు అందిస్తున్నామని తెలిపారు. తాము చేస్తున్న సేవలను గుర్తించి ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ వారు గౌరవ డాక్టరేట్ ను అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ గౌరవ డాక్టరేట్ తో తనపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టడంలో తనకు ప్రోత్సహించిన ఫౌండేషన్ సభ్యులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు రాజ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శివ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular