క్యాన్సర్ బాధిత పాప ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు

Picsart_25-02-06_19-00-40-753.jpg

గుర్రంపోడు ఫిబ్రవరి06 (నేటిదర్శిని ప్రతినిధి యడవెల్లి రమేష్):
గుర్రంపోడు గ్రామానికి చెందిన గంగరాజు తన చిన్నారి క్యాన్సర్ భారిన పడింది. ఆయన చిన్నారి పాప గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతోంది. తన కుమార్తె ప్రాణాలను కాపాడేందుకు గంగరాజు ఇప్పటివరకు ఆరు సర్జరీల వరకు చేయించారు. అయితే, వైద్యం కోసం అవసరమైన ఖర్చులు పెరుగుతుండటంతో ఆయన తనకు ఉన్న సమస్త ఆస్తిని అమ్ముకొని, తన జీవితాన్ని కూతురు కోసమే అంకితం చేసుకున్నారు.


ప్రస్తుతం చిన్నారి హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కానీ, చికిత్స కోసం ఇంకా భారీగా ఖర్చు అవసరమవుతోంది. తండ్రిగా తన చేతులారా మరిన్ని సర్జరీలు చేయించేందుకు, మెరుగైన చికిత్స అందించేందుకు గంగరాజు ధన సాయం కోరుతున్నారు.
ఈ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టేందుకు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏ చిన్న సహాయం అయినా ఆమె ప్రాణాలను కాపాడే మార్గంగా మారవచ్చు. దయచేసి మీ సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నవారు ఆర్థిక సాయం చేయగలరు.


సహాయం అందించేందుకు:
ఫోన్ పే / గూగుల్ పే నెంబర్: 9100435288
ఒక్కో రూపాయి కూడా ఈ చిన్నారి జీవితాన్ని కాపాడేందుకు ఉపయోగపడుతుంది. దయచేసి, ఈ సమాచారాన్ని మరికొంత మందికి చేరవేసి, మనిషితనాన్ని చాటుకుందాం.

1 thought on “క్యాన్సర్ బాధిత పాప ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు

Comments are closed.