వనస్థలిపురం కాంప్లెక్స్ సముదాయంలో వేడుకల్లో పాల్గొన్న జర్నలిస్టులు

ఎల్బీనగర్, ఆగస్టు 17 (నేటి దర్శిని): తొలివార్త తెలుగు దినపత్రిక ఎడిటర్, సీఈవో లింగాల నరేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు సోమవారం ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్ కాంప్లెక్స్ సముదాయంలో సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు లింగాల నరేందర్ గౌడ్ ను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లింగాల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. స్నేహం అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన నా మిత్రులు నాపై చూపించినటువంటి ఆదరాభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల్లో వివిధ రంగాల ప్రముఖులు హాజరై లింగాల నరేందర్ గౌడ్ కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ నర్రి రమేష్, ఓపెన్ ఫ్రేమ్ (ఇంగ్లీష్ దినపత్రిక) ఎడిటర్ కట్ట సత్య నారాయణ వివిధ రంగాల ప్రముఖులు రాచకొండ కృష్ణమోహన్, ఎం సంతోష్ రెడ్డి, గార్లపాటి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.





