వేధింపులు తాళలేక గిరిజన యువకుడి ఆత్మహత్య..!
-పోచబోయిన సురేశ్ యాదవ్‌పై తీవ్ర ఆరోపణలు..! -కేసును తప్పుదారి పట్టించేందుకు సెటిల్‌మెంట్‌కు యత్నించారా..! పోలీసుల కుట్ర దాగి ఉందా?! -కేసు వెనక యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ ఉన్నారా..! ఎల్బీనగర్, సెప్టెంబర్ 19 (నేటి దర్శిని): బైక్ విషయంలో జరిగిన పంచాయితీ అనంతరం తనపై దాడి చేసి, గత మూడు రోజులుగా తీవ్రంగా వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురైన రాజేష్ అనే గిరిజన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని గిరిజన, ప్రజా సంఘాలు ఆరోపించాయి. ఈ ఘటనపై ఎల్బీనగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు పోచబోయిన సురేశ్...