కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలి

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తలకొండపల్లి, ఆగస్టు 24, (నేటి దర్శిని): తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి కల్వకుర్తి ఎమ్మెల్యే శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని అన్నారు. ప్రతి కార్యకర్తకు గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తూ అందరినీ కలుపుకొని ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. తలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం...