ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
తలకొండపల్లి, ఆగస్టు 24, (నేటి దర్శిని): తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి కల్వకుర్తి ఎమ్మెల్యే శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని అన్నారు. ప్రతి కార్యకర్తకు గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తూ అందరినీ కలుపుకొని ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. తలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.