Newspaper Banner
Date of Publish : 08 August 2026, 6:27 am Digital Edition : NETI DRASHINI

వివాహ వార్షికోత్సవం సందర్భంగా 300 మంది పేద విద్యార్థులకు అల్పాహారం

కృష్ణ గోపాల్ సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

ఎల్.బి.నగర్, ఆగస్టు 7 (నేటి దర్శిని): వివాహ వార్షికోత్సవాన్ని సేవా కార్యక్రమంతో జరుపుకోవడం అభినందనీయమని కృష్ణ గోపాల్ సేవా సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. నిజామాబాద్‌కు చెందిన కృష్ణ గౌడ్, సంధ్యా గౌడ్ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కృష్ణ గోపాల్ సేవా సమితి ఆధ్వర్యంలో పేద పిల్లల పాఠశాలలో అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సుమారు 300 మంది చిన్నారులకు రుచికరమైన అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులు కృష్ణ గౌడ్, సంధ్యా గౌడ్ దంపతులకు హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పేద విద్యార్థుల కోసం సేవా కార్యక్రమం నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా FA-1 పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో కృష్ణ గోపాల్ సేవా సమితి అధ్యక్షులు డా. కపిల్ కుమార్ అగర్వాల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు, ఇతర స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని డా. కపిల్ కుమార్ అగర్వాల్ ఆకాంక్షించారు. ఈ సేవా కార్యక్రమంలో కృష్ణ గోపాల్ సేవా సమితి అధ్యక్షులు డా. కపిల్ కుమార్ అగర్వాల్‌తో పాటు సమితి అధికారులు, సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.