Newspaper Banner
Date of Publish : 09 July 2026, 7:30 pm Digital Edition : NETI DRASHINI

ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం 

  • ముఖ్యఅతిథిగా కౌన్సిలర్ ఎర్రవోలు మహేష్ 

ఆమనగల్లు,జులై09(నేటి దర్శిని):రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో గురువారం స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఏబీవీపీ నాయకులు జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ తీసి ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 9 వ వార్డు కౌన్సిలర్ ఎర్రవోలు మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రవోలు మహేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలోనే అతిపెద్ద ఏకైక విద్యార్థి సంస్థ ఏబీవీపీ అని, విద్యార్థులలో దేశభక్తి, క్రమశిక్షణ జాతీయ భావాలను పెంపొందించడంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో ఏబీవీపీ ముందుంటుందని, విద్యార్థినీ విద్యార్థులకు కావలసిన,రావలసిన హక్కులకై కొట్లాడి సాధించే దాంట్లో ముందుండేది ఏబీవీపీ అని మహేష్ కొనియాడారు.ఈ కార్యక్రమంలో జజ్జాల ఆనంద్, ఏబీవీపీ ముఖ్య నాయకులు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.