ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై జిల్లా మంత్రుల చిన్నచూపు..?
మిడ్జిల్, జులై 03, (నేటి దర్శిని మహబూబ్ నగర్ జిల్లా బ్యూరో): జూలై 4న మిడ్జిల్ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో జిల్లా ప్రజల్లో ఒక ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనేంతటి కీలక కార్యక్రమం జరుగుతున్నప్పటికీ, జిల్లా మంత్రులు ఇప్పటివరకు మిడ్జిల్ వైపు రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాత్రమే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే జిల్లా మంత్రులు స్వయంగా వచ్చి...