ఆర్టీసీ బస్సు- బైక్ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది
గుర్రంపోడు, జూలై 03(నేటి దర్శిని):రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తికి ‘108’ సిబ్బంది సకాలంలో ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి మండలం గానుగపల్లి గ్రామానికి చెందిన Ch. నరసింహ (తండ్రి చెంద్రయ్య) ఈరోజు ఉదయం తన బైక్‌పై చిన్న మందపురం రోడ్డులో గల పొలం దగ్గరకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆయన బైక్‌ను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో నరసింహ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న...