Newspaper Banner
Date of Publish : 03 July 2026, 12:32 pm Digital Edition : rameshyadavelli@gmail.com

ఆర్టీసీ బస్సు- బైక్ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

గుర్రంపోడు, జూలై 03(నేటి దర్శిని):రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తికి ‘108’ సిబ్బంది సకాలంలో ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి మండలం గానుగపల్లి గ్రామానికి చెందిన Ch. నరసింహ (తండ్రి చెంద్రయ్య) ఈరోజు ఉదయం తన బైక్‌పై చిన్న మందపురం రోడ్డులో గల పొలం దగ్గరకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆయన బైక్‌ను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో నరసింహ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గుర్రంపోడు ‘108’ అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈఆర్‌సీపీ (ERCP) డాక్టర్ మనీష్ సలహాతో ఈఎంటీ గిరి, పైలట్ శివాజీ క్షతగాత్రునికి అంబులెన్స్‌లోనే ఇంజక్షన్ ట్రామడోల్, గ్లూకోజ్ ద్రావణం అందిస్తూ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యంత కీలకమైన ‘గోల్డెన్ అవర్’లో బాధితుడిని ఆసుపత్రికి చేర్చడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన ‘108’ సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు.