యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌కు ఘన సన్మానం

హైదరాబాద్, జూలై 1 (నేటి దర్శిని): యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితులైన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌కు ఆమె నివాసంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ఘన సన్మానం నిర్వహించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ సహ-సమన్వయకర్త వజీర్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజాసేవలో విశేష అనుభవం కలిగిన ఈశ్వరమ్మ యాదవ్ సేవలను గుర్తించి యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి...