Newspaper Banner
Date of Publish : 02 July 2026, 8:55 am Digital Edition : NETI DRASHINI

యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌కు ఘన సన్మానం

హైదరాబాద్, జూలై 1 (నేటి దర్శిని): యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితులైన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌కు ఆమె నివాసంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ఘన సన్మానం నిర్వహించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ సహ-సమన్వయకర్త వజీర్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజాసేవలో విశేష అనుభవం కలిగిన ఈశ్వరమ్మ యాదవ్ సేవలను గుర్తించి యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి దేవాలయ చైర్మన్‌గా ఆమె సమర్థవంతంగా సేవలందించడంతో పాటు పేదల సంక్షేమానికి అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కర్మన్‌ఘాట్ దేవాలయంలో పనిచేసిన సేవాభావంతోనే యాదాద్రి దేవస్థానం అభివృద్ధికి కూడా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన మధుయాష్కి గౌడ్, మల్‌రెడ్డి రామిరెడ్డి, బీర్ల ఐలయ్య, వేముల నరేందర్ రెడ్డి తదితర నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను పారదర్శకంగా, నిబద్ధతతో నిర్వహిస్తానని స్పష్టం చేశారు. వనస్థలిపురం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూరెళ్ల వేములయ్య గౌడ్ మాట్లాడుతూ, దేవాలయాల నిర్వహణలో విశేష అనుభవం ఉన్న ఈశ్వరమ్మ యాదవ్‌కు యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి బాధ్యతలు అప్పగించడం సముచిత నిర్ణయమన్నారు. ఆమె అనుభవం దేవస్థానం అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ సహ-సమన్వయకర్త వజీర్ ప్రకాష్ గౌడ్, కాంగ్రెస్ యువ నాయకుడు పోచబోయిన సురేష్ యాదవ్, వనస్థలిపురం కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, బంధువులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.