Newspaper Banner
Date of Publish : 19 June 2026, 2:09 pm Digital Edition : NETI DRASHINI

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు నూతన సీఐగా శంకరయ్య

హయత్ నగర్, జూన్ 19 (నేటి దర్శిని): హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా శంకరయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు హయత్‌నగర్ సీఐగా విధులు నిర్వహించిన పల్సా నాగరాజ్ గౌడ్‌ను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మల్కాజిగిరి కమిషనరేట్ సీపీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న శంకరయ్యను హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయడంతో ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది శంకరయ్యకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తానని శంకరయ్య పేర్కొన్నారు.