సీఎం ఇల్లు ముట్టడికి పిలుపు
గుర్రంపోడులో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు గుర్రంపోడు, జూన్ 18 (నేటి దర్శిని ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఫీజుల నియంత్రణ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల తక్షణ విడుదలతో పాటు విద్యా రంగ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించ తలపెట్టిన ‘ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి’ కార్యక్రమం నేపథ్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు తరలిపోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గుర్రంపోడు మండల పరిధిలోని పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు...