గంజాయి సరఫరాపై ఉక్కుపాదం..
ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎస్సై శ్రీనివాస్ యాదవ్ మిడ్జిల్, జూన్11( నేటి దర్శిని ప్రతినిధి ):మహబూబ్ నగర్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, సరఫరాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మిడ్జిల్, బోయిన్‌పల్లి, వాడియాల ప్రాంతాల్లో నార్కోటిక్ బృందంతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలకు మిడ్జిల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీనివాస్ యాదవ్ నాయకత్వం వహించగా, పోలీసు సిబ్బంది మరియు నార్కోటిక్ బృందం సభ్యులు పాల్గొన్నారు.తనిఖీల సందర్భంగా ప్రధాన రహదారులు, గ్రామాల ప్రవేశ మార్గాలు, అనుమానాస్పద...