ఆర్&బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఆస్తులపై ఏసీబీ దాడులు

వందల కోట్ల అక్రమ ఆస్తుల ఆరోపణలు..  15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ తనిఖీలు.. హైదరాబాద్, జూన్ 9(నేటి దర్శిని): రోడ్లు భవనాల శాఖ (ఆర్&బీ) ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) మోహన్ నాయక్‌కు చెందిన ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మంగళవారం విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. ప్రాథమిక వివరాల ప్రకారం, హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో మొత్తం 15 చోట్ల ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. మోహన్ నాయక్‌కు,...