శ్రీచైతన్య కాలేజీ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

హాస్టల్ గదిలో ఉరివేసుకున్న 17 ఏళ్ల విద్యార్థి దేవేందర్‌రెడ్డి కళాశాల యాజమాన్యంపై తల్లిదండ్రుల అనుమానాలు..! బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆందోళన హయత్ నగర్, (నేటి దర్శిని): కోహెడలోని శ్రీచైతన్య కళాశాల హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. హనుమకొండకు చెందిన కోమటిరెడ్డి దేవేందర్‌రెడ్డి (17) హాస్టల్ గదిలో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.హయత్‌నగర్ సీఐ నాగరాజ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, దేవేందర్‌రెడ్డి ఇటీవల ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు గాను...