క్యాన్సర్‌పై డబుల్ విక్టరీ.. ఒకేసారి రెండు క్యాన్సర్లను జయించిన మహిళ
సింక్రోనస్ డ్యూయల్ ప్రైమరీ క్యాన్సర్స్’పై విజయం సాధించిన యశోద వైద్యులు మిర్యాలగూడ, మే 29 (నేటి దర్శిని):మలక్‌పేట్ యశోద ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక రేడియేషన్ సాంకేతికతను వినియోగించి ఒకేసారి రెండు వేర్వేరు క్యాన్సర్లకు విజయవంతంగా చికిత్స అందించి అరుదైన వైద్య విజయాన్ని నమోదు చేశారు. 64 ఏళ్ల మహిళకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించి సమగ్ర వైద్యం అందించారు. పీవీ బ్లీడింగ్ సమస్యతో చికిత్స కోసం వచ్చిన మహిళకు నిర్వహించిన పరీక్షల్లో గర్భాశయ ముఖద్వారంలో స్క్వామస్ సెల్ కార్సినోమా ఉన్నట్లు...