ఉర్కొండ నూతన ఎస్ఐ గా రమాదేవి నియామకం
మిడ్జిల్, మే28 (నేటి దర్శని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బ్యూరో): ఊర్కొండ మండల పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా రమాదేవి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఎస్ఐగా నియమితులైన రమాదేవి మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్ఐ రమాదేవి మాట్లాడుతూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. మహిళలు, చిన్నారుల రక్షణకు...