Newspaper Banner
Date of Publish : 27 May 2026, 2:32 pm Digital Edition : NETI DRASHINI

ఉర్కొండ నూతన ఎస్ఐ గా రమాదేవి నియామకం

మిడ్జిల్, మే28 (నేటి దర్శని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బ్యూరో): ఊర్కొండ మండల పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా రమాదేవి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఎస్ఐగా నియమితులైన రమాదేవి మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్ఐ రమాదేవి మాట్లాడుతూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, గ్రామాల్లో గంజాయి, అక్రమ మద్యం, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై సత్వరమే స్పందిస్తామని ఎస్ఐ రమాదేవి స్పష్టం చేశారు.