పదవ తరగతిలో అఖిల్ ప్రభంజనం
గుర్రంపోడులో ఘనంగా సన్మానించిన ఎన్నారై నాగులవంచ నర్సింహ రావు గుర్రంపోడు, మే 01(నేటి దర్శిని): పదవ తరగతి పరీక్షల్లో విశిష్ట ప్రతిభ కనబరిచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే అత్యున్నత స్థాయి మార్కులు సాధించిన విద్యార్థి యడవెల్లి అఖిల్‌ను ఎన్నారై నాగులవంచ నరసింహారావు ఘనంగా సన్మానించారు. మండల కేంద్రానికి చెందిన అఖిల్ 600 మార్కులకు 583 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో గుర్తింపు పొందడం విశేషంగా నిలిచింది. శుక్రవారం అఖిల్ నివాసానికి వెళ్ళిన నరసింహారావు, విద్యార్థిని, తల్లిదండ్రులను కలిసి అభినందనలు తెలియజేశారు. అఖిల్ సాధించిన విజయాన్ని...