Newspaper Banner
Date of Publish : 29 April 2026, 6:57 am Digital Edition : NETI DRASHINI

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసిన కృష్ణ గోపాల్ సేవా సమితి

మల్కాజ్‌గిరి,ఏప్రిల్28 (నేటి దర్శిని): కృష్ణ గోపాల్ సేవా సమితి ప్రతినిధులు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మారి రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, మెమెంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా సమితి తరఫున వినతిపత్రాన్ని సమర్పిస్తూ, సమాజ సేవా కార్యక్రమాలు మరియు భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేతో వివరంగా చర్చించారు. కృష్ణ గోపాల్ సేవా సమితి అధ్యక్షుడు కపిల్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ, సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలు, పేదల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను ఎమ్మెల్యేకు వివరించారు. ప్రజలకు మరింత సేవలు అందించేందుకు ప్రభుత్వ సహకారం అవసరమని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సమితి కోశాధికారి కుష్ అగర్వాల్, సంయుక్త కార్యదర్శి మనోజ్ గుప్తా, ఈసీ సభ్యులు సంజయ్ ధన్నావత్ పాకా, సతీష్ యాదవ్, సునీల్ దరాడే, సురేష్ ధవాలే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సమయాన్ని కేటాయించి మార్గదర్శనం చేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేకు, అలాగే యాదగిరి గౌడ్ మరియు వారి బృందానికి సమితి ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.