ముప్పారంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

నిడమనూరు, ఏప్రిల్ 26 (నేటి దర్శిని): ముప్పారం గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు అన్నేబోయిన కొండల్ పాల్గొని పార్టీ స్థాపన నుంచి ఇప్పటివరకు చేసిన సేవలను స్మరించుకున్నారు. అలాగే పాల్వాయి వెంకటేశం, వెంకటమ్మ, క్రాంతి రూపాని లక్ష్మీనారాయణ, శ్రీను, రాములు,...