హాలియా, ఏప్రిల్ 25 ( నేటి దర్శిని): మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ఆశీస్సులతో, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి మరియు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఆదేశాల మేరకు హాలియా పట్టణంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మల్‌రెడ్డి భాను చందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, అనుముల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుందూరు వెంకట్ రెడ్డి మరియు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి మేడ సైదులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడ సైదులు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం చేయాలని, అదే విధంగా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హరినాయక్, పెద్దవూర మండల అధ్యక్షులు రేపాకల సాయి, నిడమనూరు అధ్యక్షులు జానయ్య, గుర్రంపోడు అధ్యక్షులు కొత్త నాగరాజు, త్రిపురారం మండల అధ్యక్షులు గుండెబోయిన వేణు, అనుముల మండల అధ్యక్షులు నరసింహ తదితరులు పాల్గొన్నారు.