తెలంగాణపై పదే పదే విషం చిమ్మడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది
బిఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు నాయకులు గంజి కృష్ణ మిడ్జిల్, ఏప్రిల్ 17, (నేటి దర్శిని ప్రతినిధి): మిడ్జిల్ మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గంజి కృష్ణ ఒక ప్రకటనలో పేర్కొంటూ, తేజస్వి సూర్య లోక్‌సభలో చేసిన తెలంగాణపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభజనను భారత్–పాకిస్థాన్ విభజనతో పోల్చడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య అని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష వల్ల ఏర్పడినది కాదని, వేలాది మంది యువకుల త్యాగాలు, సుదీర్ఘ ప్రజాస్వామ్య పోరాట...