పాత పద్దతిలోనే అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలి
- కేబుల్ టీవీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో కేబుల్ టివి సి.ఈ.ఓ.లు హైదరాబాద్, ఏప్రిల్08 (నేటి దర్శిని): తెలంగాణ కేబుల్ టీవీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా కేబుల్ టీవీ సంస్థల సీఈఓలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేబుల్ టీవీ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు...