- నందిగామ పోలీస్ ఎస్ఐ యాదయ్య గారు పదవీ విరమణ పొందిన సందర్భంగా
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విగ్నేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో
- పదవి విరమణ పొందుతున్న కావలి యాదయ్యకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు
నందిగామ,మార్చి31(నేటి దర్శిని ప్రతినిధి): “కర్తవ్య నిర్వహణలో ఒక స్ఫూర్తిదాయక ప్రస్థానం” నిబద్ధతకు నిలువుటద్దంగా, శాంతి భద్రతలకు తన జీవితాన్ని అంకితం చేసిన నందిగామ పోలీస్ ఎస్ఐ యాదయ్య గారు పదవీ విరమణ పొందిన సందర్భంగా అభిమానులు, నాయకులు, గ్రామ ప్రజలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… “కానిస్టేబుల్‌గా అడుగు వేసి, అంచెలంచెలుగా ఎదిగి, నేడు సబ్ ఇన్స్పెక్టర్గా పదవీ విరమణ పొందుతున్న మీ ప్రయాణం ఒక అద్భుత గాథ. ఖాకీ దుస్తులకు మీరు అందించిన గౌరవం, సామాన్యులకు మీరు కల్పించిన భరోసా మీ వృత్తి పట్ల మీకున్న అంకితభావానికి నిదర్శనం. హెడ్ కానిస్టేబుల్‌గా, ఏ.ఎస్.ఐగా, నేడు ఎస్.ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మీరు చూపిన సమయపాలన, కర్తవ్యనిష్ఠ మాకు అందరికీ ఆదర్శంగా నిలిచింది. మీ సేవలు కేవలం రికార్డుల్లోనే కాదు, మా మండల ప్రజల గుండెల్లోనూ చిరస్థాయిగా నిలిచిపోతాయి” అని అన్నారు. వృత్తిపరమైన బాధ్యతల నుండి విరమణ పొందుతున్న ఈ సందర్భంలో… “మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, నిండు నూరేళ్లూ మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటున్నాము” అని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్వతాలు, అమర్నత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కుమ్మరి మలేశ్, శ్రీనివాస్ రెడ్డి, అంజి రెడ్డి, ఎండి ఖాదర్, సత్యనారాయణ రెడ్డి, భూపతి రెడ్డి, హరీ బాబు, ఎండి హనీఫ్, యాదయ్య, మాధవా చారి తదితరులు పాల్గొన్నారు.




