Newspaper Banner
Date of Publish : 01 April 2026, 9:50 pm Digital Edition : NETI DRASHINI

ఏసీబీ వలలో చిక్కిన చైతన్యపురి ఏఎస్సై బాలయ్య

  • రూ.15 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్
  • కాంప్రమైజ్ కేసు క్లోజ్ చేయించేందుకు లంచం డిమాండ్
  • బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు
  • కోర్టు ప్రాంగణంలో ట్రాప్ ఏర్పాటు చేసి పట్టుకున్న అధికారులు
  • మహిళా వేధింపుల కేసులో లోక్ అదాలత్ పేరుతో అక్రమ డిమాండ్
  • అదుపులోకి తీసుకుని ఏఎస్సైపై విచారణ ప్రారంభం

ఎల్.బి.నగర్,ఏప్రిల్01 (నేటి దర్శిని): మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై బాలయ్య అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కాడు. మహిళా వేధింపుల కేసును లోక్ అదాలత్ ద్వారా క్లోజ్ చేయించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైం నెం. 363/2025లో పల్లపు రాంబాబు పై మహిళా వేధింపుల కేసు నమోదు అయ్యింది. అనంతరం ఈ కేసు కాంప్రమైజ్ అయినప్పటికీ, దానిని కోర్టు ద్వారా క్లోజ్ చేయించేందుకు ఏఎస్సై బాలయ్య రూ.15 వేల లంచం కోరినట్లు సమాచారం. దీంతో బాధితుడు పల్లపు రాంబాబు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ముందస్తుగా ట్రాప్ ఏర్పాటు చేసి, కోర్టు ప్రాంగణంలోనే బాలయ్య లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అనంతరం ఏఎస్సై బాలయ్యను అదుపులోకి తీసుకుని, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో మరోసారి అవినీతి అంశం చర్చనీయాంశంగా మారింది.