చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు పార్టీల గ్రీన్ సిగ్నల్
పలు మున్సిపాలిటీల్లో నేడు పాలకవర్గాల ఏర్పాటు నేటి దర్శిని (వెబ్ న్యూస్ డెస్క్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు పురపాలక సంఘాల్లో నేడు పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ముఖ్యంగా నిర్మల్, చెన్నూరు, లక్షెట్టిపేట, అలాగే మంచిర్యాల కార్పొరేషన్‌లో స్పష్టమైన మెజారిటీ ఉండడంతో పాలకవర్గాల ఏర్పాటు సులభంగా పూర్తికానుంది. మిగిలిన మున్సిపాలిటీల్లో మాత్రం పొత్తులు, స్వతంత్రుల మద్దతుతో ఉత్కంఠ కొనసాగుతోంది. నిర్మల్‌లో ఒకే కుటుంబం నుంచి నాలుగోసారి నిర్మల్ పురపాలక సంఘంలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలు లాంఛనమే కానున్నాయి. చైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యే...