Manikarnika Ghat: మణికర్ణిక ఘాట్‌పై ఫేక్ ఏఐ చిత్రాలు.. కాంగ్రెస్, ఆప్ నేతలతో సహా 8 మందిపై కేసు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న ప్రఖ్యాత మణికర్ణిక ఘాట్‌ అభివృద్ధి పనులకు సంబంధించి సోషల్ మీడియాలో కృత్రిమ మేధ (AI)తో సృష్టించిన ఫేక్ చిత్రాలు, తప్పుడు ప్రచారం చేసినందుకు 8 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మణికర్ణిక ఘాట్‌లో జరుగుతున్న సుందరీకరణ పనులకు సంబంధించి వాస్తవాలకు విరుద్ధంగా, కల్పిత చిత్రాలను ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా కొందరు ప్రచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ చిత్రాలలో హిందూ దేవతలను అవమానకరంగా చూపించారని, తద్వారా మత విశ్వాసాలను దెబ్బతీసి, ప్రజల్లో...