Newspaper Banner
Date of Publish : 06 December 2025, 8:39 am Digital Edition : Unknown Author

బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు అక్రమ అరెస్ట్

🔹 సీఎం పర్యటనకు ముందు బిఆర్ఎస్ నేతల అరెస్టులు

🔹 6 గ్యారంటీలను అమలు చేయకపోవడంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

🔹 అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరని బిఆర్ఎస్ నాయకుల హెచ్చరిక

గుర్రంపోడు/నేటి దర్శిని: దేవరకొండ పర్యటనకు విచ్చేయుచున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకుంటారని అనుమానంతో, గుర్రంపోడు పోలీస్‌లు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావుని ఈరోజు ఉదయం ఆయన ఇంటి వద్ద నుంచే అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ —

“తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతోంది. ప్రజలను మోసం చేస్తోంది. గ్యారంటీలు అమలు చేసిన తర్వాతే ప్రజల వద్దకు రావాలి. అక్రమ అరెస్టులతో మా పోరాటాన్ని ఆపలేరు” అని హెచ్చరించారు.

అరెస్ట్ చేసిన వారిలో బిఆర్ఎస్ యువజన నాయకులు కూనూరు సైదిరెడ్డి, వనమాల మహేందర్, మహిళా సంఘాల సభ్యులు, కార్మిక నాయకులు, ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు.

బిఆర్ఎస్ కార్యకర్తలు ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, “ప్రజా స్వరాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం నిజానికి ప్రజల భయంతోనే ఇలా చేస్తోంది” అని ఆరోపించారు.