Newspaper Banner
Date of Publish : 06 December 2025, 9:43 am Digital Edition : Unknown Author

డ్రగ్స్‌పై యువతలో చైతన్యం తీసుకురావాలి: జి.నగేష్‌

వరల్డ్‌ వైస్‌ కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆధ్వర్యంలో నో డ్రగ్స్‌, నో ఆల్కాహాల్‌, నో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌

పోస్టర్‌ ను ఆవిష్కరించిన నగేష్

ఎల్.బి.నగర్‌,డిసెంబర్05(నేటి దర్శిని): పెడదోవ పడుతున్న యువతలో అవగాహన కల్పించేందుకు వరల్డ్‌ వైస్‌ కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ శేరిలింగంపల్లి నియోజవర్గం చైర్మన్‌ భారత ప్రసాద్‌ చేస్తున్న కృషి అభినందనీయమని వరల్డ్‌ వైస్‌ కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ రంగారెడ్డి జిల్లా చైర్మన్‌ జి.నగేష్‌ అన్నారు. వరల్డ్‌ వైస్‌ కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆధ్వర్యంలో నో డ్రగ్స్‌, నో ఆల్కహాల్‌, నో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పేరుతో సమరాన్ని ప్రకటించింది. వరల్డ్‌ వైస్‌ కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ శేరిలింగంపల్లి నియోజకవర్గం చైర్మన్‌ భారత ప్రసాద్‌ ఆధ్వర్యంలో నో డ్రగ్స్‌, మద్యం నుండి యువతను కాపాడుకుందాం.. నవభారతాన్ని నిర్మించుకుందాం…పేరుతో రూపొందించిన పోస్టర్‌ ను జి.నగేష్‌ శుక్రవారం ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జి.నగేష్‌ మాట్లాడుతూ యువతలో డ్రగ్స్‌పై, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా వారిలో చైతన్యం తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్‌, శ్రీనివాస్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.