ప్రభుత్వ ఆసుపత్రిలో వికటించిన వైద్యం

17 మంది చిన్నారుల అస్వస్థత – ఐసీయూకు తరలింపు గ్లూకోస్, ఇంజక్షన్ ఇచ్చిన కొద్ది సేపటికే చిన్నారుల్లో పరిస్థితి విషమం డ్యూటీ డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు,పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన హాలియా,నవంబర్ 15 (నేటి దర్శిని): నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హాలియాలోని కమల నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి జరిగిన వైద్యుల నిర్ల్యక్ష్య ఘటన కలకలం రేపింది. పిల్లల వార్డులో చేరి చికిత్స పొందుతున్న మొత్తం 17 మంది చిన్నారులకు సిబ్బంది గ్లూకోస్, ఇంజక్షన్లు వేసిన కొద్ది సేపటికే పరిస్థితి విషమించింది. చిన్నారులు...