Nagarjuna: మంత్రి కొండా సురేఖపై కేసు వాపసు తీసుకున్న నాగార్జున
హైదరాబాద్,నవంబర్ 3(నేటి దర్శిని): మంత్రి కొండా సురేఖ(Konda Surekha), ప్రముఖ నటుడు నాగార్జున(Nagarjuna) మధ్య నెలకొన్న వివాదానికి తెర పడింది. నాగార్జునను ఉద్దేశిస్తూ మంత్రి సురేఖ నిన్న ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ఆమె బహిరంగ క్షమాపణలను పరిగణనలోకి తీసుకున్న నాగార్జున, తమకు న్యాయం జరిగిందని భావించి.. క్రిమినల్ దావా పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. నాగార్జున కుటుంబంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానని మంత్రి కొండా సురేఖ నిన్న ఎక్స్‌లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ‘‘నాగార్జున, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో...