ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణముద్దగౌని సతీష్ గౌడ్ సేవలు అభినందనీయం: సీఐ మహేష్

ముద్దగౌని సతీష్ గౌడ్ సేవలు అభినందనీయం: సీఐ మహేష్

📰 Generate e-Paper Clip

ఎల్.బి.నగర్,నవంబర్03 (నేటి దర్శిని):మాలధారణ చేసిన  వందలాదిమంది స్వాములకు నిత్యాన్నదానం చేయడం అభినందనీయమని వనస్థలిపురం సిఐ టి.మహేష్ అన్నారు. శ్రీ మల్లికార్జున భక్త సమాజం అధ్యక్షులు, శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వందలాదిమంది శివ స్వాములు, అయ్యప్ప స్వాములు, హనుమాన్ స్వాములకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వనస్థలిపురం సీఐ మహేష్ హాజరై స్వాములకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. అంతకుముందు సీఐని అధ్యక్షులు ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ గురుస్వామి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాలధారణ చేసిన వందలాదిమంది స్వాములకు ప్రతి సంవత్సరం నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సతీష్ కుమార్ గౌడ్ గురుస్వామి చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల సీఐ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular