Cricketer: ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరో విషాదం.. బంతి తగిలి యువ క్రికెటర్ దుర్మరణం
నేటి దర్శిని (వెబ్ న్యూస్): ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి విషాదం చోటుచేసుకుంది. మెల్‌బోర్న్‌కు చెందిన 17 ఏళ్ల యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ ఈ రోజు కన్నుమూశాడు. మంగళవారం రాత్రి ఫెర్న్‌ట్రీ గల్లీలోని వాలీ ట్యూ రిజర్వ్ మైదానంలో ఆటోమేటిక్ బౌలింగ్ మెషిన్‌తో ప్రాక్టీస్ చేస్తుండగా, బంతి నేరుగా అతని మెడ వెనుక భాగంలో బలంగా తగిలింది. దీంతో బెన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.తక్షణమే సహచరులు అతడిని అత్యవసర చికిత్స కోసం క్లేటన్‌లోని మోనాష్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు చిన్న మెదడుకు గాయం జరిగినట్లు...