శాంతి భద్రతలు కాపాడుతూ ఎల్లప్పుడూ పొలిస్ మీకోసం
👉🏻 పోలీసు అమరవీరుల స్ఫూర్తితోనే పోలీస్ సేవలు... 👉🏻 సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన... 👉🏻 నేరాలు , మాదక ద్రవ్యాల వాడకం పై విద్యార్థులకు అవగాహన... మందమర్రి, అక్టోబర్ 23 ( నేటి దర్శిని) : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) వారోత్సవాలను పురస్కరించుకొని, మందమర్రి పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం 'ఓపెన్‌హౌస్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మందమర్రి ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంపై పట్టణంలోని చైతన్య నగర్ ప్రభుత్వ పాఠశాల ...