Newspaper Banner
Date of Publish : 21 October 2025, 12:52 pm Digital Edition : Unknown Author

పోలీసు అమరవీరుల త్యాగాలకు ఘన నివాళులు

🔸భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్ కుమార్

నారాయపేట,అక్టోబర్21 (నేటి దర్శిని): ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను దేశం ఎప్పటికీ మరువదని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి తెలిపారు. నేడు జరుపుకుంటున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.

డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ – “శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగం అపారమైనది. వారి ధైర్యసాహసాలు, అంకితభావం నేటి తరం పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేసే ప్రతి పోలీసు సిబ్బంది పట్ల సమాజం కృతజ్ఞతతో ఉండాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు ఫౌండేషన్ తరపున సానుభూతి తెలియజేస్తూ, వారి సేవలకు గుర్తింపుగా సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. పోలీసు వ్యవస్థ సమాజ శాంతి స్థాపనలో కీలక భూమిక పోషిస్తోందని ఆయన ప్రశంసించారు.