Newspaper Banner
Date of Publish : 19 October 2025, 1:03 pm Digital Edition : Unknown Author

అస్మిత కిడ్ బాక్సింగ్ లీగ్‌లో హైదరాబాద్ విద్యార్థుల ఘన విజయం

🔹మహబూబ్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీలలో ఐ కం బ్యాక్ స్పోర్ట్స్ విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన

🔹లహరి ఎం గిరీష్ స్వర్ణం, నిత్య వెండి పతకం

🔹స్పోర్ట్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి హామీ

ఎల్.బి.నగర్, అక్టోబరు19(నేటి దర్శిని): మహబూబ్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అస్మిత కిడ్ బాక్సింగ్ లీగ్లో హైదరాబాద్ బేగంపేట్‌కి చెందిన ఐ కం బ్యాక్ స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు మెరిసారు. ఈ పోటీలలో భాగంగా లైట్ కాంటాక్ట్ కేజీ–60 విభాగంలో లహరి ఎం గిరీష్ స్వర్ణ పతకాన్ని, సెమి కాంటాక్ట్ మైనస్ 42 కేజీల విభాగంలో నిత్య వెండి పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయాలు కోచ్‌లు అరుణ్ సింగ్ మరియు టీ. శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో సాధించారు. విజయం సాధించిన విద్యార్థులను హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని భీష్మరాజ్ ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ ఛైర్మెన్ రాజ్ కుమార్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అమ్మాయిలకు చదువుతో పాటు కిక్ బాక్సింగ్, టైక్వాండో, గ్రాప్లింగ్, కరాటే వంటి క్రీడల్లో కూడా ప్రోత్సాహం ఇవ్వడం సమాజ అభివృద్ధికి అవసరం. స్పోర్ట్స్ రంగంలో ఎల్లప్పుడూ అండగా ఉంటాను. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు భీష్మరాజ్ ఫౌండేషన్ ద్వారా సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాను” అని తెలిపారు. డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లోనే కాకుండా తన స్వగ్రామమైన నారాయణపేటలో కూడా క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు.