Newspaper Banner
Date of Publish : 07 October 2025, 3:28 pm Digital Edition : Unknown Author

కొల్లంపల్లిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి

  • జయంతోత్సవాలకు హాజరైన రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట, అక్టోబర్07 (నేటి దర్శిని):
ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా కొల్లంపల్లి గ్రామంలోని వాల్మీకి మహర్షి దేవాలయంలో సోమవారం భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాల్మీకి మహర్షి చూపిన మార్గంలో యువతరం పయనించాలని సూచించారు. అనంతరం దేవాలయ నిర్వాహకులు, గ్రామస్థులు రాజ్ కుమార్ రెడ్డిని శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గుజ్జుల కృష్ణన్న, బుడ్డ నర్సింహ, బద్రి, మారుతి, పుల్లరి నరేష్, వాల్మీకి యువసేవ ప్రతినిధులతో పాటు ఫౌండేషన్ సభ్యులు రాఘవేందర్ గౌడ్, వై.సంతోష్, కరాటే అశోక్, ఎం.సంతోష్, వాచ్యానాయక్, బాలునాయక్, దశరథ్ నాయక్, మోహన్ నాయక్, చంద్యా నాయక్, శ్రీనివాస్, బాలునాయక్, బలరాం, మహిళలు పాల్గొన్నారు.